సీమాంధ్ర : కోస్తాంధ్రకు భారత వాతావరణశాఖ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. తెలంగాణలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను వాతావరణశాఖ అప్రమత్తం చేసింది.




