Tuesday, 3 November 2026

అధికారం కోసమే జగన్‌ డ్రామాలు

హైదరాబాద్‌ : అధికారం కోసమే జగన్‌ డ్రామాలు ఆడుతున్నారని టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ నిప్పులు చెరిగారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తర్వాత సీమాంధ్రలో ఆధిపత్యం కోసమే చంద్రబాబు ,జగన్‌ ,కిరణ్‌, యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ముగ్గురు రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను దోచుకోవడానికి జగన్‌ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. చరిత్ర తెలుసుకుని జగన్‌ మాట్లాడితే బాగుంటుందని సూచించారు. రాష్ట్రం విడిపోతే జగన్‌కు 30 ఎంపీ స్థానాలు వస్తాయని ప్రశ్నించారు. జగన్‌కు మతిభ్రమించిందని విమర్శించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ అభివృద్ది చెందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *