హైదరాబాద్ : అసహనంతో తమ కోపాన్ని బిడ్డలపై చూపి తల్లిదండ్రులే వారిని ఆస్పత్రిపాలు చేసిన సంఘటనలు బుధవారం చోటుచేసుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా. గన్నవరంలో బడికి వెళ్లడం లేదని ఏడేళ్ల కుమారుడిని కన్నతండ్రే నేలకేసి బాదాడు. పిల్లవాడి పరిస్థితి విషమంగా ఉండగా బంధువులు ఆస్పత్రికి తరలించారు. వరంగల్ జిల్లా కరీమాబాద్‌లో ఓతల్లి ఐదేళ్ల చిన్నారి అల్లరి చేస్తుందని చెట్టుకేసి కొట్టినట్లు సమాచారం. ఆ పాప పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు.




