హైదరాబాద్ : నవంబర్ 1 ని విద్రోహ దినంగా పాటించాలని తెలంగాణ జేఏసీ పిలుపునిచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా పలు నిరసన కార్యక్రమాలు చేపట్టి విద్రోహదినాన్ని పాటించాలని టీ జేఏసీ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చింది. జేఏసీ ఢిల్లీ టూర్‌ను వాయిదా వేసుకున్నట్లు సమాచారం. తెలంగాణను వ్యతిరేకించిన విజయమ్మ ఓదార్పు మకొద్దని రేపు నల్గొండ పర్యటనకు వస్తున్న విజయమ్మను నిలదీయాలని జేఏసీ పిలుపునిచ్చింది.




