హైదరాబాద్ : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రాష్ట్రంలో పలుచోట్ల రవాణాశాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ముంబయి- హైదరాబాద్ జాతీయ రహదారిపై మూడు ప్రాంతాల్లో అధికారులు తనీఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్న 3 బస్సులను జప్తు చేశారు.శంషాబాద్ సమీపంలోని షాపూర్ చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేపట్టి 6 బస్సులను జప్తు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 6, నెల్లూరులో ఒక బస్సును జప్తుచేసినట్టు అధికారులు తెలిపారు.




