
విజయమ్మ మొసలి కన్నీరు అక్కర్లేదు
ఓదార్పును అడ్డుకోండి
టీ జేఏసీ చైర్మన్ కోదండరామ్
హైదరాబాద్, అక్టోబర్ 30 (జనంసాక్షి) :
నవంబర్ 1ని విద్రోహ దినంగా పాటించాలని తెలంగాణ జేఏసీ పిలుపునిచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా పలు నిరసన కార్యక్రమాలు చేపట్టి విద్రోహదినాన్ని పాటించాలని టీ- జేఏసీ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చింది. జేఏసీ ఢిల్లీ టూర్‌ను వాయిదా వేసుకున్నట్లు టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. బుధవారం నగరంలోని జేఏసీ కర్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణను వ్యతిరేకించిన విజయమ్మ ఓదార్పు మాకొద్దని రేపు నల్గొండ పర్యటనకు వస్తున్న విజయమ్మను నిలదీయాలని జేఏసీ పిలుపునిచ్చింది. విజయమ్మ తెలంగాణకు వస్తే మరో మహబూబ్‌బాద్ ఘటన చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడే రాజకీయ అరాచకశక్తులకు ఇక్కడ చోటు లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణవాదులు ఆంధ్రప్రదేశ్ అవతర దినాన్ని విద్రోహ దినంగా పాటించాలని సూచించారు.
నవంబర్ 1 విద్రోహమే




