Monday, 2 November 2026

పయ్యావుల కేశవ్‌ను పార్టీనుంచి సస్పెండ్‌ చేయాలి : ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : తెలంగాణకు వ్యతిరేకంగా కేసు వేసిన టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని ఆ పార్టీకే చెందిన మరో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్‌ చేశారు. టీడీపీని ఇరుకున పెట్టేందుకే కేంద్రం మరోసారి అఖిలపక్ష భేటీ నిర్వహిస్తుందని ఎర్రబెల్లి ఆరోపించారు. అఖిలపక్ష భేటీకి వెళ్లాల్సిన అవసరం లేదని ఎర్రెబెల్లి చెప్పారు. సమైక్యవాద టీడీపీని తెలంగాణ కోసం ఒప్పించగలిగామని ఆయన అన్నారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లును చంద్రబాబు సమర్దిస్తారని ఎర్రబెల్లి పేర్కొన్నారు. త్వరలో తెలంగాణ టీడీపీ ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. మరోపక్క అఖిలపక్షం ,తాజా రాజకీయాలపై టీడీపీ సీమాంధ్ర ముఖ్యనేతలు భేటీ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *