Monday, 2 November 2026

వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

నల్లగొండ : వర్షాల వల్ల దామరచర్లలో దెబ్బతిన్న పత్తి పంటను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరీశీలించారు. నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పాలనలో రైతులు సంతోషంగా లేరని తెలిపారు. నీలం తుపాన్‌ బాధితులకు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదని చెప్పారు. సమస్యలను రైతులు ధైర్యంగా ఎదురుకోవాలని ,ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. వాణిజ్య పంటలకు ఎకరానికి రూ. 20 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *