హైదరాబాద్ : హైదరాబాద్‌ను 3 నుంచి 5 ఏళ్లు మాత్రమే ఉమ్మడి రాజధానిగా ఉంచాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు పేర్కొన్నారు. కేంద్రమంత్రుల బృందానికి సమర్పించే నివేదికను వారు ఈరోజు విడుదల చేశారు. సీఎల్పీలో సమావేశమై చర్చలు జరిపిన అనంతరం నివేదికను విడుదలచేస్తూ 371 డి అధికరణను సవరించాలని ,మండలిని కొనసాగించాలని పేర్కొన్నారు. హైదరాబాద్ పాలనపై ఇరు రాష్ట్రాల సీఎంలు, డీజీపీలు, సీఎస్‌లతో బోర్డు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీలు సూచించారు.




