Monday, 2 November 2026

గన్‌పార్కులో నల్లపావురాలు ఎగురవేసి నిరసన తెలపిన తెలంగాణ జాగృతి కవిత

హైదరాబాద్‌ : గన్‌పార్కులోని అమరవీరుల స్ధూపం దగ్గర నల్ల పావురాలు ఎగురవేసి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈసంధర్బంగా జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇంత దూరం వచ్చినంకా కూడా సీఎం కిరణ్‌ తెలంగాణను అడ్డుకుంటామని ప్రగల్బాలు పలకడం మంచిది కాదని ,సీమాంధ్రుల జీవితాలతో ఆటలాడుకోవద్దని హితువు పలికారు. ఏ గాంధీ వారసుడో సీఎం కిరణ్‌ చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. నవంబర్‌ 1ని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపడాన్ని ఖండిస్తున్నామన్నారు. నవంబర్‌ 1 మాకు చెదరని గాయంగా ఉండిపోతుందని ఆమే పేర్కొన్నారు. తెలంగాణను సాధించుకోవడంతో చివరి అంకాన్ని చేరినామని ఆమె తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *