హైదరాబాద్ : తన కూతురి వయస్సున్న విద్యార్ధినులను లైంగికంగా వేధిస్తూ , అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ కామ టీచర్‌పై నిర్భయ కేసు నమోదైంది. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన గురువు సభ్యసమాజం తలదించుకునేలా విద్యార్ధులను లైంగికంగా వేధించిన సంఘటన రాష్ట్ర రాజధానిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఎస్సార్ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన 31 ఏళ్ల భుజంగరావు జూబ్లీ హిల్స్ లక్ష్మీనరసింహానగర్‌లో ఫ్యామీలితో నివాసముంటున్నాడు. ఎస్సార్‌నగర్‌లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో మ్యాథ్స్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఇదే పాఠశాలలో 8వ తరగతి చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థినులపై కన్నువేశాడు.ఈ కామాందుడు .తరగతులు ముగిశాక ఒక్కొక్కర్నీ తన వద్దకు పిలిపించుకుని అసభ్యంగా ప్రవర్తించడం మొదలెట్టాడు. దీంతో బాధిత విద్యార్ధినులు ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు. వాళ్లు సదరు పాఠశాలకు వచ్చి ప్రిన్సిపాల్ ఉషాదేవితో పాటు ఎస్సార్ నగర్ పోలీసులకు పిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కామాంధుడు భుజంగరావును అదుపులోకి తీసుకుని …వాడిపై నిర్భయచట్టంలోని 354 డి సెక్షన్‌తో పాటు ఐపీసీ 509 ,బాలలపై లైంగిక నేరాల నిరోధక చట్టం 9ఎఫ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని తెలసుకున్న టీఆర్‌ఎస్వీ ,ఏబీవీపీ , ఏఐఎస్‌ఎఫ్ , విద్యార్ధి సంఘాల నేతలు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు.




