హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసేవన్ని దివాళకోరు రాజకీయాలు అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ మాటలు… తెలంగాణను అడ్డుకునేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. కేంద్రం తెలంగాణకు అనుకూలంగా ఉందని తెలిసి కూడా నాటకాలు ఆడుతున్నారు, చంద్రబాబుకు నీతి ఉందా? టీడీపీ నినాదం ఏంటో చంద్రబాబు చెప్పాలి. సమన్యాయం అంటే ఏమిటో కిరణ్,జగన్,బాబు అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాలి. దేశ మొదటి పౌరుడి పట్ల దురభిమానం ఏర్పడే విధంగా సీమాంధ్ర నేతలు మాట్లాడడం సబబు కాదు. రాష్ట్రపతికి తెలంగాణ తెలియదన్నట్లు సీమాంధ్ర నేతలు ఓవరయాక్షన్ చేస్తున్నారు. రాజ్యాంగబద్దుడై పని చేయాల్సిన సీఎం కిరణ్ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన అన్నారు. జగన్ ,బాబు కిరణ్ ముమ్మాటికి తెలంగాణ ద్రోహులనిఆయన అన్నారు.




