Tuesday, 3 November 2026

ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో పాల్గొన్న రాష్ట్రపతి

హైదరాబాద్‌ : సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీలో జరిగిన శిక్షణ ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లోరాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పాల్గొన్నారు.రాజ్‌భవన్‌ నుంచి పోలీసు అకాడమీకి చేరుకున్న ఆయన ముందుగా సర్దార్‌ వల్లబాయ్‌పటేల్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో పాల్గొన్నారు.పరేడ్‌ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రత్యేక వాహనంలో మైదానంలో పర్యటించి పరేడ్‌ను తిలకించారు. ఆయన వెంట గవర్నర్‌ నరసింహాన్‌ ఉన్నారు.శిక్షణ పూర్తి చేసుకున్న 148 మంది ఐపీఎస్‌ అధికారులు ఈ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో పాల్గొన్నారు. వీరిలో ఏపీ కేడర్‌కు చెందినవారు 8 మంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *