Tuesday, 3 November 2026

దేశ సమగ్రతకు ఐపీఎస్‌లు కృషి చేయాలి : ప్రణబ్‌ ముఖర్జీ

హైదరాబాద్‌ : దేశ సమగ్రతకు ఐక్యతకు ఐపీఎస్‌లు కృషి చేయాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సూచించారు. సర్దార్‌ వల్లభాయ్‌ జాతీయ పోలీసులు అకాడమీలో ఐపీఎస్‌లు శిక్షణ ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. అంకితభావంతో శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌ అధికారులను అబినందిస్తున్నానని తెలిపారు. సామాన్యులకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఐపీఎస్‌లు పనిచేయాలన్నారు. ఐపీఎస్‌లు వృత్తి పట్ల నిబద్దత ,అంకితభావం కలిగి ఉండాలని సూచించారు. మతసామరస్యం కాపాడడంలో ఐపీఎస్‌లది కీలకపాత్ర అని తెలిపారు. నిరంతరం ఉగ్రవాదులకు భారత్‌ లక్ష్యంగా మారుతోందని చెప్పారు. ఉగ్రవాదం ,చొరబాటుదారులకు అరికట్టడంలో భారత ప్రభుత్వం కృత నిశ్చయంతో పని చేస్తోందన్నారు. జస్టిస్‌ వర్మ కమిటీ సూచనల మేరకు మహిళలపై వేధింపుల నివారణకు కొత్త చట్టం తెచ్చామని ఆయన చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *