హైదరాబాద్ : అడ్డుఅదుపులేకుండా పెరిగిపోతున్న ధరలపై సీపీఎం పోరుబాట పట్టింది. ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ సీపీఎం నాయకులు విజయవాడలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పన్నుల వడ్డింపు, అధిక ధరలు, నగదు బదిలీ పధకం రద్దు,సంక్షేమ పథకాలు విఫలం తదితరాలపై ఆ పార్టీ పోరు ప్రారంభించింది. రచ్చబండలో ప్రభుత్వ అలసత్వంపై నిలదీయాలని ,అందుకోసం ప్రజానీకాన్ని సిద్దం చేసేందుకు పోరుబాటలో భాగంగా పాదయాత్ర చేపట్టారు. ధరల భారానికి నిరసనగా వంటగ్యాస్, సిలిండర్లు మోసి తమ నిరసన తెలిపారు.




