హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేతలపై కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. వాళ్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తొత్తులుగా మారారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అప్రజాస్వామికంగా జరుగుతోందని సీమాంధ్ర తెలుగు దేశం పార్టీ నేతలు వీళ్లు ఏంచేస్తున్నట్లు అని ఆయన నిలదీశారు. తెలంగాణ టీడీపీ నేతలు ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.




