విద్యార్ధినిని గర్భవతిని చేసిన గురువు

నల్లగొండ : విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సిన గురువే కీచకుడిగా మారాడు. నల్లగొండ జిల్లా చిలుకూరి మండలం రామాపురం గ్రామంలో ఓ గురువు తన విద్యార్ధినిని గర్బవతిని చేశాడు.ఆ విద్యార్ధిని పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. ఆ పాఠశాల ఉపాధ్యాయుడు ఆ బాలికను గర్భవతిని చేశాడు. అంతే కాకుండా ఆ గర్భం తీయించడానికి ప్రయత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. డీఈవో కలుగజేసుకొని ఆ కీచక గురువుని సస్పెండ్‌ చేశారు.