Tuesday, 3 November 2026

కొద్ది సేపట్లో ప్రారంభం కానున్న అంగారక యాత్ర

హైదరాబాద్‌ : మరికాసేపట్లో భారత అంగారక యాత్ర ప్రారంభం కానుంది.మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల 38 నిమిషాలకు పీఎస్‌ఎల్వీ సి 25 ప్రయోగిస్తారు. ఈ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రపంచ దేశాలన్ని భారత్‌ వైపు ఆసక్తిగా గమనిస్తున్నాయి.శ్రీహరికోటలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. గాలివాటం పరిశీలనకు శాస్త్రవేత్తలు ఆకాశంలోకి బెలూన్లు వదులనున్నారు. ప్రయోగానికి ముందు ఐదుసార్లు ఈ విధంగా బెలూన్లు వదలనున్నారు. మార్స్‌ అర్బిటర్‌ ఉపగ్రహం ఇప్పటికే సూపర్‌ కంప్యూటర్‌ ఆదీనంలోకి వెళ్లింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *