Tuesday, 3 November 2026

నక్సల్‌ సమస్య అదుపులో ఉంది : డీజీపీ

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నక్సల్స్‌ సమస్య అదుపులో ఉందని డీజీపీ ప్రసాద్‌రావు తెలిపారు. మావోయిస్టులు పలుమార్లు సరిహద్దు దాటేందుకు యత్నిస్తున్నట్లు వివరించారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాల ఎస్పీలు ,ఓఎస్డీలు డీఐజీలతో సమావేశమైనట్లు ఆయన డీజీపీ చెప్పారు. భద్రతా పరిస్థితుల దృష్టా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి మైన్‌ ప్రూఫ్‌ వాహనాన్ని సమకూర్చినట్లు డీజీపీ చెప్పారు. ఉగ్రవాదుల దృష్టి హైదరాబాద్‌పై ఉందన్నారు. పాలెం ఘటనపై సీఐడీ దర్యాప్తు ప్రారంభమైందన్నారు. ఆ దుర్ఘటనలో ఇప్పటి వరకూ 34 మంది మృతులను గుర్తించామని ,మరో 9 మందిని గుర్తించాల్సి ఉందని డీజీపీ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *