హైదరాబాద్ : రాష్ట్ర విభజనపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటిపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ ఆయన తలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ విభజనపై టాస్క్‌పోర్స్ తయారు చేసిన నివేదిక సీమాంధ్రుల స్క్రిప్ట్ సీమాంధ్రుల దర్శకత్వంలోనే టాస్క్‌పోర్స్ నివేదిక తయారు చేసిన్రని,ఏకపక్షంగా నివేదిక తయారుచేశారని సీమాంధ్ర పాలకులు హైదరాబాద్‌ను స్కాం కాపిటల్‌గా మార్చారని. టాస్క్‌పోర్స్ నివేదిక తప్పుల తడకగా ఉందని, ముఖ్యమంత్రి కబ్బాలు టాస్క్ పోర్సుకుకనపడవా ? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులను ,తెలంగాణవాదులను కించపరిచేలా టాస్క్‌పోర్స్ నివేదిక ఉందని ,సీమాంధ్రుల ఒత్తిడికి లోనై టాస్క్ పోర్స్ కేంద్ర హోంశాఖ కు తప్పుల తడకగా నివేదిక ఇచ్చారని ఆయన అన్నారు.




