హైదరాబాద్ : చందానగర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. తెలంగాణవాదులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. తెలంగాణ జేఏసీ యాత్రలో పాల్గొనేందుకు వెళ్లిన కోదండారం , శ్రీనివాస్‌గౌడ్,లను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో తెలంగాణ వాదులు ఆందోళనకు దిగారు. కోదండరాం శ్రీనివాస్‌గౌడ్‌లతో పాటు జర్నలిస్టులను అరెస్ట్ చేయడాన్ని టీజేఎఫ్ టీఈఎమ్జేయూ తీవ్రంగా ఖండించింది.




