Tuesday, 3 November 2026

సీడబ్ల్యూసీ నిర్ణయం ముందు కిరణెంత?


ఎవరైనా కట్టుబడాల్సింది : దిగ్విజయ్‌సింగ్‌
న్యూఢిల్లీ, నవంబర్‌ 10 (జనంసాక్షి) :
కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నిర్ణయం ముందు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కాదు ఎవరూ అతీతులు కాదని, ఎంతటివారైనా కట్టుబడి ఉండాల్సిందేనని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అధిష్టానం నిర్ణయాన్ని దిక్కరిస్తూ సమైక్యవాదం వినిపిస్తున్న కిరణ్‌పై దిగ్విజయ్‌సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి కమిటీ సీడబ్ల్యూసీ అని, దాని నిర్ణయాలను కాంగ్రెస్‌ నాయకులందరూ పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ విభజనపై కిరణ్‌కు సొంత అభిప్రాయాలు ఉంటే ఉండవచ్చని, కానీ వాటిని బహిరంగంగా ప్రకటించడం సరికాదని, ఎవరైనా పార్టీ దారిలోకి రావాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజనపై విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరిపిన తర్వాతే కాంగ్రెస్‌ అధిష్టానం విభజనకు నిర్ణయం తీసుకుందని తెలిపారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీపీఎం మినహా అన్ని పార్టీలు తెలంగాణకు సమ్మతించాయని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *