Tuesday, 3 November 2026

రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత కనిష్ట స్థాయికి తగ్గిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుంది. శీతాకాలం ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు క్రమేణా తగ్గుముఖం పడుతుండడంతో చలితో ప్రజలు వణికిపోతున్నారు. గత రెండు రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గగా ..హైదరాబాద్‌లో తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. బుధవారం హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 13 డిగ్రీలకు పడిపోయే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు రోజలు క్రితం వరకు 18.5 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రతలు మంగళవారం 14.3 డిగ్రీలకు చేరుకున్నాయి. ఉత్తర, ఈశాన్య భారతం నుంచి రాష్ట్రం వైపు చల్లని పొడిగాలులు వీస్తుండడంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *