Tuesday, 3 November 2026

ప్రియురాలి గొంతుకోసి చంపిన ప్రియుడు

నల్గొండ, దేవరకొండ : ప్రియుడు గొంతుకోసి దారుణంగా ప్రియుడు హతమార్చిన సంఘటన నల్గొండ జిల్లా దేవరకొండ పరిధిలోని కాచారం గుట్ట సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటన సోమవారం రాత్రి జరగగా ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది కొంభీమనపల్లి సంచాయితీ పరిధిలో ఖాదర్‌ మెమోరియల్‌ కళాశాలలో ఎంబీఏ పూర్తిచేసిన గోలి కవిత (23) అనే అమ్యాయిని తోటి విద్యార్థి ప్రకాశం జిల్లా రాచర్ల మండలం హనుమలవీడుకు చెందిన బాలకృష్ణ (24) బలవంతంగా కాచారం గుట్టల్లోకి తీసుకెళ్లి హతమార్చాడు. గతంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఇటీవల కవితకు పెద్దలు నిశ్చయం చేయడంతో ఆగ్రహించిన బాలకృష్ణ ఆమెను చంపాలని ప్రణాళిక వేశాడు. సోమవారం కాచారం గుట్టల్లోకి తీసుకెళ్లీ ఇద్దరం చనిపోదామని విషం ఆమెకు తాగించి, అతనూ తాగాడు. అనంతరం ఆమె గొంతుకోసి దేవరకొండ వచ్చేశాడు. తెలిసిన వాళ్లతో విషం తాగిన సంగతి చెప్పగా హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో ఆతన్ని చేర్పించారు అమ్మాయి. మూడు రోజులుగా కనిపించక పోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగి పోలీసులు కేసు దర్యాప్తు చేసి హైదరాబాద్‌లో ఉన్న బాలకృష్ణను విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ మేరకు దేవరకొండ సీఐ భాస్కర్‌ వివరాలను విలేకరులకు విల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *