హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఈ రోజు సాయంత్రం జరిగే బాలల చలన చిత్రోత్సవంలో పాల్గొనాల్సిందిగా కేంద్రమంత్రి మనీష్ తివారీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డిని కోరినందునే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన వాయిదా పడినట్లు ఏఐసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. మనీష్ తివారీ కోరిక మేరకే సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా పడిందని వారు తెలిపారు. రాష్ట్ర విభజనపై ఈ రోజు రాత్రి 8 గంటలకు ఢిల్లీలో జీవోఎంతో సీఎం సమావేశం కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అయితే సీఎం పర్యటన ఆకస్మికంగా వాయిదా పడడంతో పలురకాల వూహాగానాలకు తెరలేచింది. దాంతో ఏఐసీసీ వర్గాలు ఈ వివరణ ఇచ్చాయి.




