హైదరాబాద్ : జంజారాహిల్స్ పరిధిలోని కమలాపురి కాలనీలో వ్యభిచార ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అర్ధరాత్రి మెరుపుదాడి చేసి పట్టుకున్నారు. సుబ్బారెడ్డి ,కృష్ణ అనే ఎపీఎస్పీ 12వ బెటాలియన్ ,కానిస్టేబుళ్లు, సురేష్,అనే వ్యక్తితో కలిసి ఈ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు ….వీరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో ఐదుగురు యువతులు,,నలుగురు యువకులు ఉన్నారు. వీరిని రాత్రి బంజారహిల్స్ పీఎస్‌కు తరలించగా ….పోలీసులు కేసు నమోదు చేశారు.




