హైదరాబాద్ : ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీహెచ్‌ఈఎల్‌లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించినట్లే ఇక్కడ కూడా స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్ చేశారు. 80 శాతం స్థానికులనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బీహెచ్‌ఈఎల్ ఎగ్జాగ్ ఇంటర్వ్యూలకు 1544 మంది స్థానికేతరులను పిలిచి ఇక్కడి వారిని మాత్రం 290 మందిని మాత్రమే పిలిచారిని ఆయన తెలిపారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో 80 శాతం ఉండాల్సిన స్థానికులు 20 శాతం కూడా లేకపోవడం దారుణమన్నారు. ఈ నెల 25న జరగవోయే ఇంటర్వ్యూలను తాత్కాలికంగా వాయిదా వేయడానికి బీహెచ్‌ఈఎల్ ఈడీ ఒప్పుకున్నారని ఆయన తెలిపారు. తాము ఇచ్చిన వినతులపై కార్పోరేట్ ఆఫీస్‌కు లేఖ రాస్తామని ఈడీ హామీ ఇచ్చారని ఆయన చెప్పారు.




