కావలి :నెల్లూరు జిల్లా కావలి మండల పరిధిలోని గౌరవరం వద్ద జాతీయ రహదారి వద్ద ఓ మహిళను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ రోడ్డుపై పడిపోవడంతో, అదే సమయంలో అటుగా వెళ్తున్న లారీ ఆ మహిళపైకి దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో పూరిమెట్ల యంకయ్య (40) అక్కడికక్కడే మృతిచెందింది. అదుపు తప్పిన కారు బోల్తాపడగా అందులోని నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కావలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




