Tuesday, 3 November 2026

నకిలీ పత్రాలను తయారు చేస్తు ఇద్దరు వ్యక్తుల అరెస్ట్‌

హైదరాబాద్‌ : వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన నకిలీ పత్రాలను తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను గాంధీనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రబ్బరు స్టాంపులు, ల్యాప్‌టాప్‌, స్కానర్‌, ప్రింటర్‌ నకిలీ సర్టిఫికేట్స్‌లను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్‌ జిల్లాకు చెందిన శ్రీనివాస్‌, నల్గొండ జిల్లాకు చెందిన యాదగిరి షేర్‌ మార్కెట్లో నష్టాలు రావడంతో డబ్బుల కోసం యూనివర్శిటీ పత్రాలను తయారు చేయడం మొదలు పెట్టారు. నిరుద్యోగులను ఆసరాగా చేసుకుని వివిధ యూనివర్శిటీలకు చెందిన నకిలీ ధ్రువపత్రాలను తయారు చేసి రూ.వేయి నుంచి పదివేల వరకూ అమ్మకాలు జరిపేవారు. వీరు ఇప్పటివరకూ 400లసర్టిఫికేట్స్‌ తయారు చేసి పలువురికి విక్రయించినట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *