హైదరాబాద్:మోసాలకు పాల్పడుతున్న ఆమ్‌వే ఇండియా ఎండీ విలియంను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. విలియంను కోర్టులో హజరు పరిచామని సీఐడీ చీఫ్ కృష్ణ ప్రసాద్ తెలిపారు. 2006 నుంచి ఆమ్‌వే ఆర్థిక నేరాలకు పాల్పడుతోందని చెప్పారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో ఆమ్‌వే అక్రమంగా డబ్బులు వసూలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆమ్‌వేపై రాష్ట్రంలో పలు చోట్ల కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఆమ్‌వేపై సీఐడీ కోర్టులో విచారణ ప్రారంభమైందని తెలిపారు. ఆమ్‌వే చెప్పే మాటలను నమ్మొద్దని ప్రజలకు సీఐడీ చీఫ్ సూచించారు.




