కుత్బుల్లాపూర్ (హైదరాబాద్) : జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ కామాంధుడు తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి, బాలికను బీరువాలో బంధించాడు. పోలీసుల కథనం ప్రకారం… కుత్బుల్లాపూర్‌లోని సంజయ్‌గాంధీ నగర్ (గుబురుగుట్ట) కాలనీకి చెందిన బొబ్బులు (26) స్థానిక మెకానిక్ సర్వీస్ సెంటరులో పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన తొమ్మిదేళ్ల బాలికను ఆదివారం సాయంత్రం చాక్లెట్లు ఇస్తానని చెప్పి ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం బాలికపై అత్యాచారం చేసి బీరువాలో బంధించి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. బాలిక కోసం తల్లి వెతికినా ఆచూకీ అభ్యంకాలేదు. దీంతో బొబ్బులుపై అనుమానం వచ్చిన తల్లి స్థానికుల సయంతో సోమవారం బొబ్బులు ఇంటి తాళం పగలగొట్టి చూడగా ఇంట్లోని బీరువాలో బాలిక ఉంది. తీవ్ర అస్వస్తతకు గురైన బాలికను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.




