Tuesday, 3 November 2026

ఆటో, ట్రాక్టర్‌ ఢీ : ముగ్గురి మృతి

ఉంగుటూరు : పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం 16వ జాతీయ రహదారిపై కైకరం వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. భీమడోలు నుంచి నారాయణపురం ఐస్‌ ఫ్యాక్టరీకి వెళ్తున్న ఆటోని రాంగ్‌ రూటులో వెళ్తున్న ట్రాక్టర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నర్సమ్మ (35), వరలక్ష్మి (35), స్వాతి(25) మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ఏడుగురిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చేబ్రోలు ఎస్సై వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చెస్తున్నారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *