Tuesday, 3 November 2026

నకిరేకల్‌లో రచ్చబండ రచ్చరచ్చ

నల్లగొండ : నకిరేకల్‌ పట్టణంలో మండల కార్యాలయంలో నిర్వహించన రచ్చబండ కార్యక్రమం రచ్చరచ్చయింది. ఇవాళ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు కొందరు రచ్చబండ వేదికపై ఏర్పాటు చేసిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ఫ్లెక్సీని చించేశారు. నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉధ్రిక్తత ఏర్పడింది. చివరికి కాంగ్రెస్‌ నాయకులు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని కొనసాగించారు. దీంతో సీఎం సందేశం లేకుండానే అధికారులు రచ్చబండను కొనసాగించారు. ఈ సమయంలో కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ చిరంజీవులు, స్థానిక ఎమ్మెల్యే లింగయ్య తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *