Wednesday, 4 November 2026

పద్దెనిమిదేళ్ల బాలిక పై అత్యాచారం

హైదరాబాద్‌ : ఉతన్తరప్రదేశ్‌ లోని ఫైజాబాద్‌లో పద్దెనిమిదేళ్ల బాలిక అత్యాచారానికి గురయింది. ప్రభుత్వం తరుపున పంపిణీ చేస్తున్న ఉచిత ల్యాప్‌టాప్‌ కోసం స్నేహితులతో కలిసి ఆమె నిన్న అమేథీనుంచి ఫైజాబాద్‌ వెళ్లింది. మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమం అని అధికారులు సాయంత్రం ఏడు వరకు మొదలు పెట్టలేదు. అవధేష్‌ ప్రసాద్‌ అనే మంత్రి దాక ఆలస్యం కావడం వల్ల రాత్రి ఏడింటికి మొదలైన కార్యక్రమం అయిపోయేసరికి రాత్రి పదయింది. ప్రభుత్వం కానీ, కళాశాలల యాజమాన్యాలు కానీ విద్యార్థులకు రవాణా ఏర్పాట్లు చేయలేదు. దాంతో తమ వూరికి చెందిన ఇతర విద్యార్థులతో కలిసి జీపులో బయల్దేరింది ఈ అమ్మాయి కూడా. అందరినీ దించాక చివరగా దిగాల్సిన ఆమెపై జీపు డ్రైవరును అరెస్టు చేశారు. మంత్రి రాక కోసం పిల్లలను రాత్రి దాకా ఉంచుతారా అని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *