Tuesday, 3 November 2026

ఏపీ ఎన్జీవోల సమ్మె వాయిదా

హైదరాబాద్‌: ఏపీ ఎన్జీవోల సమ్మెపై విచారణ మరోసారి వాయిదా పడింది. సమ్మె రాజ్యాంగ విరుద్దమంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. హైకోర్టులో ఈ రోజు కూడా వాదనలు జరిగాయి. శుక్రవారం జరిగే విచారణలో వాదనలు లాఖిత పూర్వకంగా అందజేయాలని కోర్టు పిటిషనర, ప్రతివాదుల్ని ఆదేశించింది. రెండు పేజీలకు మించకుండా ఈ వాదనలు ఉండాలని న్యాయస్థానం సూచించింది. ఏపీఎన్జీవోల సమ్మె చెల్లదని దాఖలైన పిటిషన్‌పై గత ఎనిమిది రోజులుగా హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. సీమాంధ్ర ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక ఉద్యోగ సంఘాలు, నాయకులు ఈ కేసులో ఇంప్లీడ్‌ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *