హైదరాబాద్ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన హెలెన్ తుపాను క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోంది. ఇది మరింత బలపడి రాగల 24 గంటల్లో పెనుతుపాన్గా మారే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. తుపాన్ ప్రస్తుతం చెన్నైకి తూర్పు – ఈశాన్య దిశలో 460 కిలోమీటర్లు, ఒంగోలుకు తూర్పు దిశలో 360 కిలోమీటర్లు ,మచిలిపట్నానికి తూర్పు- ఆగ్నేయ దిశలో 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాన్ నెల్లూరు – మచిలిపట్నం మధ్య ఒంగోలుకు సమీపంలో రేపు మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల ఇవాల్టీ నుంచి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో రేపటి నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ,కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.




