లండన్, నవంబర్ 20 (జనంసాక్షి) :
పాకిస్తాన్ బాలికల విద్యా ఉద్యమకారిణి మలాలా యూసుఫ్‌జాయ్‌ని మరో అరతర్జాతీయ పురస్కారం వరించింది. ప్రతిష్టాత్మక సఖరోవ్ మానవ హక్కుల అవార్డును బుధవారం ఆమె స్వీకరించింది. యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడు మార్టిన్ షుల్జ్ ఈ అవార్డును మలాలాకు ప్రదానం చేశారు. పాకిస్తాన్‌లో బాలికల విద్యపై తాలిబన్లు విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా ఆమె ఉద్యమించి వారి ఆగ్రహానికి గురైంది. తాలిబన్లు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మలాలా మృత్యువుతో పోరాడి ప్రాణాలతో బయటపడింది. ఐరోపాకు అవతలి వైపు ఎన్నో దేశాల్లో ప్రజలు ఇప్పటికీ మౌలిక హక్కులకు నోచుకోవడం లేదని, కనీసం స్వేచ్ఛ కూడా వారికి కరువైందని షుల్జ్ పేర్కొన్నారు. ఇలాంటి దుస్థితిపై ఐరోపా పార్లమెంట్ దృష్టి సారించిందని చెప్పారు. సోవియెట్ శాస్త్రవేత్త, అసమ్మతి నేత ఆండ్రీ సఖరోవ్ జ్ఞాపకార్థం ఐరోపా పార్లమెంట్ ఏటా ఈ మానవ హక్కుల అవార్డును ప్రదానం చేస్తోంది.
మలాలాకు సఖరోవ్ అవార్డు




