హైదరాబాద్ : ఇవాళ దేశవ్యాప్తంగా భారీ ఎత్తున లోక్‌ఆదాలత్ కార్యక్రమాలు జరుగనున్నాయి. తాలుకా స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రతి కోర్టులో లోక్ ఆదాలత్ కార్యక్రమాలు జరుగుతాయని జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ప్రకటించింది. సుప్రీంకోర్టులో ఉదయం 9.15 గంటలకు లోక్ ఆదాలత్ కార్యక్రమాన్ని ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివం ప్రారంభించనున్నారు. నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఉదయం 10.30 గంటలకు లోక్ ఆదాలత్ కార్యక్రమాన్ని జస్టిస్. జి. రోహిణి ప్రారంభించనున్నారు.




