అమీర్పేట,హైదరాబాద్: గాంధీ నేచురోపతి వైద్య విద్యార్థులు చేస్తున్న ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. విద్యార్థులను బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించారు. దీంతో ఒక విద్యార్థి స్ప్రుహ తప్పి పడిపోయింది. జీవో నెం. 162ను రద్దు చేయాలని గత 15 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న వైద్య విద్యార్థులు రెండు రోజులుగా ఆమరణ దీక్షలు చేపట్టారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు వైద్యులు హెచ్చరించడంతో ఎస్ ఆర్ నగర్ పోలీసులు బలవంతంగా వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది.




