హైదరాబాద్ : నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న పలు హుక్కా సెంటర్లపై వెస్ట్‌జోన్ పోలీసులు అర్దరాత్రి దాడులు నిర్వహించారు. బంజారాహిల్స్,జూబ్లీహిల్స్,మెహిదీపట్నం, పంజాగుట్ట ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 12 మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. హుక్కా కేంద్రాలు నడుపుతున్న యజమానులపై కేసులు నమోదు చేశామని వెస్ట్‌జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు.




