Tuesday, 3 November 2026

సంపూర్ణ తెలంగాణ వచ్చే వరకూ పోరాటం : దేవిప్రసాద్‌

నల్లగొండ : తెలంగాణ వనరులను దోచుకోవడానికి కొంత మంది పెట్టుబడిదారులు భద్రాచలం, మునగాలపై కుట్రలు చేస్తున్నారని టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్‌ ఆరోపించారు. సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారం సంపూర్ణ తెలంగాణ ఇవ్వకపోతే మరో యుద్దానికి సిద్దమవుతామని ఆయన హెచ్చరించారు. ఉద్యోగులు అనుక్షణం అప్రమత్తంగా ఉండి సంపూర్ణ తెలంగాణ వచ్చే వరకూ పోరాడుతామని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *