హైదరాబాద్ : నిజామాబాద్‌లోని నాగారం రాజీవ్ గృహకల్పలో అభంశుభం తెలియని 12 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. యువకుడు బాలికను డాబాపైకి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాలికకు తీవ్ర రక్తస్త్రావం కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐదో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.




