హైదరాబాద్: కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రైబునల్ ఇచ్చిన తీర్పుపై రాష్ట్రంలోని నీటటి పారుదల రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తీర్పుతో రాష్ట్రం మిగులు జలాలపై హక్కు కోల్పోవడంతో దాని ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్ధకమే అని వారు అభిప్రాయపడ్డారు. పీఏబీఆర్‌కు 10 టీఎంసీలు కేటాయించాలని కోరినా ట్రైబునల్ పట్టించుకోలేదన్నారు. బలమైన వాదనలు వినిపించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. న్యాయవాదులను తరచూ మార్చడం వల్లే తీర్పు మన రాష్ట్రానికి వ్యతిరేకంగా వచ్చిందన్నారు.




