Monday, 2 November 2026

మంత్రి బాలరాజు పై చర్యతీసుకోవాలి

హైదరాబాద్‌: మంత్రి బాలరాజు పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో మండి పడ్డారు. విశాఖ జిల్లా పాడేరులో మంత్రి బాలరాజు ఆగడాలు రోజు రోజుకూ మితిమీరుతున్నాయని ధ్వజమెత్తారు. మంత్రికి వ్యతిరేకంగా మాట్లాడిన ఓ గిరిజన మహిళ ఇంటిపై దాడి చేసి కూల్చివేయడం దారుణమన్నారు. మంత్రి బాలరాజు పై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరడానికి వచ్చానని…సీఎం అందుబాటులో లేకపోవడంతో సమస్యను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి దృష్టికి తీసుకెళ్లినట్లు సచివాలయం వద్ద నారాయణ మీడియాతో చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *