Tuesday, 3 November 2026

ఢిల్లీలో మూడో పార్టీకి అవకాశమే లేదు:అద్వానీ

ఇంటర్నెట్‌ డెస్క్‌, హైదరాబాద్‌: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొన్న సేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్‌.కె. అద్వానీ ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆవ్‌)పై పరోక్ష వాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మూడో పార్టీ విజయం సాధించే అవకాశం లేదని ఆవ్‌ని ఉద్దేశించి అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీ ఓట్లన్నీ ఒకే పార్టీ కొల్లగొడుతుందని, మూడో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని చెప్పారు. ఢిల్లీ ఓటర్లు తెలివైన వారన్న అద్వానీ భాజపానే గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *