Tuesday, 3 November 2026

అమరుడు శ్రీకాంతాచారికి ఘన నివాళి

దేవరుప్పుల: తెలంగాణ కోసం ఆత్మబలిదానానికి పాల్పడిన అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 4వ వర్ధంతి సందర్భంగా దేవరుప్పుల మండలంలో మంగళవారం టీ
ఆర్‌ ఎస్‌ నాయకులతో పాటు తెలంగాన వాదులు ఘనంగా నివాళులర్పించారు. దేవురుప్పల, గొల్లపల్లిలో జరిగిన సభలో టీఆర్‌ఎస్‌ వియోజక వర్గం ఇన్‌చార్జి డాక్టర్‌ సుధాకర్‌ రావు, శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి, నానమ్మ గోవిందమ్మ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సుదాకర్‌ రావు మాట్లాడుతూ శ్రీకాంతాచారి ఆశయం నెరవేరే సమయం ఆసన్నమైందన్నారు. సంపూర్ణ తెలంగాణ సాధనే ధ్యేయంగా అందరూ ఉద్యమించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌మండల అధ్యక్ష, కార్యదర్శులు రమేశ్‌, జలేందర్‌ రెడ్డి, సర్పంచ్‌ ఆకవరం నర్సింహారెడ్డి, పలు గ్రామాల సర్పంచ్‌లు ధరావత్‌ భీముడు, భీమ్లా నాయక్‌, నర్సింహ, గ్రామ అధ్యక్షుడు పరశురాములు, నాయకులు మల్లయ్య, సాయిలు, రాజిరెడ్డి, ఐలయ్య, కృష్ణమూర్తి, వీరాచారి, సోమయ్య పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *