Tuesday, 3 November 2026

స్థానిక కోర్టుల్లోనూ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని స్వీకరించొచ్చు

హైదరాబాద్‌: ప్రజ్పాయోజన వ్యాజ్యాన్ని కింది న్యాయస్థానాల్లోనూ విచారణకు స్వీకరించొచ్చని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కల్యాణ్‌ జ్యోతిసేన్‌ గుప్తా విజయవాడలో తెలిపారు. ఇటీవల మరణించిన జస్టిస్‌ పద్మనాభ రెడ్డి స్బారక ఉపన్యాస సభలో ఆయన పాల్గొన్నారు. ఆయనతో పాటు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయం-ప్రజాప్రయోజన వ్యాజ్యం అనే అంశంపై ఆయన ప్రసంగించారు. సుప్రీంకోర్టు, హైకోర్టులతో పాటు అన్ని న్యాయస్థానాల్లోనూ ఒకే న్యాయవ్యవస్థ ఉంటుందని, ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని స్థానిక కోర్టులోనూ స్వీకరించొచ్చని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *