Tuesday, 3 November 2026

హైదరాబాద్‌పై ఆంక్షలు సహించం: మంత్రి దానం

హైదరాబాద్‌: రాష్ట్ర విభజన అంశంలో భాగంగా హైదరాబాద్‌పై ఆంక్షలు విధించడాన్ని మంత్రి దానం నాగేందర్‌ ఖండించారు. జీహెచ్‌ఎంసీ పరిధిని కేంద్ర పాలనలో పెట్టే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గతంలో మూడు రాష్ట్రాలు విభజించినప్పుడు ఎలాంటి ఆంక్షలు విధిస్తున్నారని ప్రశ్నించారు. నగరంలో నివసించే సీమాంధ్ర ప్రజల రక్షణకు తాను భరోసా ఇస్తానన్నారు. కేంద్రప్రభుత్వం ఈ ప్రతిపాదనపై పున: పరిశీలన చేయకపోతే హైదరాబాద్‌లో ఘర్షణలకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *