హైదరాబాద్: బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణీకుడి వద్ద నుంచి రూ. 10 లక్షల విలువ చేసే బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకకు చెందిన సయ్యద్ మక్సూద్ బ్యాంకాక్ నుంచి థాయ్ ఎయిర్లైన్స్ విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. కస్టమ్స్ అధికారులు ప్రయాణీకులను తనిఖీ చేస్తుండగా సయ్యద్ వద్ద భారీగా బంగారం ఉండటాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.




