Tuesday, 3 November 2026

ఢిల్లీలో దీక్ష చేపట్టనున్న ఫ్లోరోసిస్‌ బాధితులు

హైదరాబాద్‌: ఏడు లక్షల మంది ఫోరోసిస్‌ పీడితులకు ప్రభుత్వం న్యాయం చేయాలన్న డిమాండ్‌తో తెలంగాణ నెటిజన్స్‌ ఫోరం ఆందోళనకు సిద్ధమవుతోంది. ఫ్లోరోసిస్‌ బాధితుల వేదనను ఢిల్లీ పాలకులకు తెలియజేసేందుకు ఈ నెల 16, 17న జంతర్‌ మంతర్‌ వద్ద ఫ్లోరోసిస్‌ బాధితులతో దీక్ష చేపట్టనున్నట్లు ఫోరం ప్రతినిధులు హైదరాబాద్‌లో తెలిపారు. నల్గొండ జిల్లాకు రక్షిత మంచినీరు, సాగునీరు అందించాలని, ఫ్లోరోసిస్‌ను జాతీయ విపత్తుగా గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని, శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌ను పూర్తి చేయాలన్న డిమాండ్‌తో ఈ దీక్షను చేపట్టినట్లు పేర్కొన్నారు. రెండు రోజుల దీక్ష అనంతరం రాష్ట్రపతి, ప్రధాని, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీకి వినతి పత్రం ఇవ్వనున్నట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *